చంద వార్ధి దయతొ అందించె కాబోలు
ఆటవెలది అన్న ఆణి పూస
పద్య సేద్య తలపు పడి నట్టి మనముల
కల్పవల్లి వోలె కావ నెంచి…ఆట వెల ది

ఆట లాడ నీతొ ఆడను లేరని
దిగులు మాను మింక  నగవు పులుము
ఆటవెలది చెలియ ఆడగా చేరెను
రేయి పవలు  లేక  రేగి పొమ్ము   –ఆట వెల ది

 

 

2–నా తరమా

మనసు లేని వారి తో ను  బతకాలన నా తరమా
మనసిచ్చిన వారు లేక గడపాలన నా తరమా

అమ్మ నాన్న చెప్పు మాట ఏనాడూ కాదనలే
పెళ్లంటూ ఎవరెవరి నొ చూడాలన నా తరమా

ఆస్తిపాస్తు లుంటె చాల అందాలే చూస్తారా
మనసు తెలియ యత్నించర చెప్పాలన నా తరమా

మున్నెన్నడు కన్నెరగని కలల సీమ చూపెనతడు
అన్నిటినీ ఇటుపిమ్మట మరవాలన నా తరమా

మిన్నంటిన ప్రణయ లోక విలాసాలు తేలినామె
తనను కాక వేరొకరిని తలవాలన  నా తరమా

ఒక్క మారు నా వారి ని   నన్నిమ్మని   అడగ మనర
చెట్టు పుట్ట  అతని కి నే తెలపాలన నా తరమా

నీతోగా సెలయేరూ పాట లెన్నొ పాడినాము
ఓ రాగం తనకు పంపు !వెళ్లా ల న నా తరమా

నీవు చొరని తావుందా ?మము నిమిరిన గుర్తుందా?
చిరు గాలీ తనను కలుపు !కలవాలన నా తరమా!

నాకం లో వేల్పులార  మమ్మొక్కటి చేయరార
మీదీవెన లేకుంటే  జరగాలన నా తరమా

విభజన అయిపోయింది..ప్రత్యేకత రాదనీ తెలిసిపోయింది. ఇంకా తల రాతల తల పోతలు అవసరమా?.

తెలుగు పులుగు కిదో పిలుపు..వినగలిగితే..వాస్తవం కనగలిగితే..ఇదో గొప్ప మలుపు. భావి లో తప్పకుండా ఘన గెలుపు.
గజల్–1-ఓయి తెలుగు వాడ..అడుగడుగో వెలుగు వాడ !

పాతంతా పాతరెయ్యి కొత్త తలపు అడుగడుగో
ఊపందుకు ఉరక లెయ్యి గొప్ప గెలుపు అడుగడుగో

తెగువ చూపు తెలుగు వాడ ఎదన నిలుపు ఆశ శ్వాస
వేటేస్తే లేచొచ్చే తెగని తలపు అడుగడుగో

నరి కారని నలి పారని పాడు తలపు మది నెందుకు
అడ్డు వచ్చు దారులలో నఱుకు కలుపు అడుగడుగో

అలవాట్లను ఆవలేసి తీయు తలుపు నవరీతికి
అగచాట్ల ని అనమాకు జయం పిలుపు అడుగడుగో

తలరాతలు తలపోస్తే అలుపు సొ లుపు కాకేమిటి
ఇక  చేతలు పదును పెట్టు మంచి మలుపు అడుగడుగో

ప్రత్యేకత రాదుగాని  వేరుతలపు వేడ్క తలువు
నవ్య తెలుగు సీమ మెరుపు పొందు మలుపు అడుగడుగో

వ్యధల, సొ దల కధల గతం అనవసరం అనవరతం
పదిల పరచు పగల బాపు పసిడి తలపు అడుగడుగో

నరికారని నస పెడితే చిగురు పలుకు వినలేవుర
చిదిమారని చిందులాపు మరో గెలుపు అడుగడుగో

మన శక్తి,,ఘన యుక్తి మదిన నిలుపు అనుక్షణం
చరితెరుగని భవితెగసే భూరి గెలుపు అడుగడుగో

బూడిదయిన బతుకు నుండి ఎగిసె పులుగు వినలేదా
గాడి తప్పు బతుకులకూ అందు గెలుపు అడుగడుగో

మన కలిమీ,మన బలిమీ ,చేత లలో చూపు రేపు
కోత కొచ్చు కలల సిరుల ,గెలుపు పంట అడుగడుగో

ఊరుకోక ఊరుకు ముందు వచ్చు గెలుపు జార్చ బోకు
జారిపోకు,పారిపోకు నిత్య గెలుపు అడుగడుగో.