గాయం మాన్పే గేయం కా!!!

నిన్నటి వరకూ అంతా నీ ప్రతిభన్నావ్ !

నీ కసాధ్యం లేదన్నావ్ !

చంద్ర లోకాన్ని చుట్టి వచ్చానని జబ్బ లేగ రేసావ్!

గ్రహాల్లో నీళ్ళకి ,నివాసాలకి ప్రయత్నాలు మొదలెడ తానన్నావ్

పైవాడు ఎవడూ లేడన్నావ్!

ప్రకృతి నాకే ,నాదే అని కుప్పిగంతు లేసావు

నీలాటి వదరు బోతుకి సుదర్శనంఏలా!

చిన్న రేణువు చాలురా ఉత్తరకుమారా !

నీకు కనబడని కరోనా మరోనా అంది

కలల నుండి నిన్ను ఇలకి దింపింది

పేరాశల ఇటుకలతో కట్టుకున్న

పేక మేడలు కూల్చింది

నలుగురిదీ నొల్లుకోవాలన్న

నాటకాలకు తెర దించింది

వణుకు తప్ప కంటికి కునుకు

లేకుండా చేసింది.

ప్రపంచ కుగ్రామ భావన ని

ఛిద్రం చేసింది

నీ ఆశలు అంతం, రేపులు దగ్ధం చేసి

యుగాంతం ఇదే నా అనిపింప జేసింది.

ఈ మరణ మృదంగ వాదన

ఈ ఆరని మనుషుల వేదన

నీ జాతి మహా ప్రస్థానానికి

పూర్వ ప్రస్తావన చేయకురా!

ఇక పై మానవత్వ పునాది పై

రేపటి కలల సౌధం లేపరా

తోటి మనుషుల గాయాలకు

సాటి లేని లేపనం అవరా!

All reactions:

138Shankar Suraram, మెరాజ్ ఫాతిమా and 136 others

8 వ కవితా తరంగాలు

పిడికిట్లో ప్రపంచం!!..

బాలకృషుడి నోట్లో విశ్వంయశోదకి కలయో మాయో అన్న సంశయ మేమో గానీ;-మనకీ పిడికిట్లో ప్రపంచంజగమే మాయా, ఈ బ్రతుకేమిటయాఅనిపించేస్తోంది అన్నది నిజం.”కర్లో దునియా ముట్టీ మే‌”అని ముద్దుగా మురిపిపించిందీఈ చరవాణే;-“భర్ లో మన్ కో మిట్టీ సే” అనిఫేకులూ,బోకులూ తో బుర్ర నింపేస్తోందీ వగల బోణే.మన గుప్పిట్లో ఉంటుంది అనుకుంటేమననే తన గుప్పిట్లో పెట్టేసుకుంది.ఈ అంతర్జాలం లో ఉనికి కి,ఈ మాయాజాలం లో మనికి కి;-కాలు కదపక్కరలేదువేలు మెదిపితే చాలు.మంచీ చెడు అన్నీ కళ్ళ ముందే;-ఎంచటం ,తుంచటం మనకి తెలియాల్సిందే!!!మన కాలం భోంచేస్తూ,మానవ బంధాలను తెంచేస్తూ;-ఈ అరచేత జగం చల రాణి,ఇహ పరపు ఊసు మరిపించే వదరు బోణి!!..పుస్తకాలకు సమాధి కట్టింది,మస్తకాలు మొద్దు బార్చింది!!ఇప్పుడు ఈ సాంకేతికత ;-వరమో, శాపమోతేల్చు కోమనితన రింగు టోనులసంగీతం పాడుతోందిఈ కీరవాణి.

నువ్వే లోకం!!!..

పుట్టక ముందు నుంచే నిన్ను

ప్రేమించిన

పుట్టాక నువ్వే లోకం గా జీవించే

ఏకైక జీవిని.

కడుపు లో పడ్డ నాటి నుండి పడ్డ తిప్పలూ నొప్పులూ

భూమి మీద నువు పడిన ఉత్తర క్షణం లో మరిచి పో గలిగిన నీ పై ఏన లేని

మమకారాన్ని.

నీ ఆకలి, ఆశలు అర్ధం చేసుకుని

నీ బుద్ధికి,వృద్ధికి దోహదం చేసే నేను

నీకు లాలి పాటలు పాడినా

వేల పాఠాలు నేర్పినా

నీకు చీకటి తెలియని రేపుల నీయాలనే.

వేకువ రేకుల శోభల నువు ఎదగాలనే.

అడ్డాల్లో బిడ్డవి గడ్డాలూ, మీసాలూ

పెంచేసి

పొత్తిళ్ళ లోంచి ఒత్తిళ్ళ లోకి

జారుకుంటే

నీ ఆశల ఆరాటం తో

నీ జీవన పోరాటం లో

నువు తడ బడుతుంటే..

నిన్ను చూస్తూ తల్లడిల్లే

నన్ను చేర సందేహమా??

నీతొలి నడకల కి నీకు

నడబండి గా

నీ గాయాల ను మాన్పే

మలాముగా

నీకు నేను కొత్తా??

నాకు నువ్వు బరువా??

నిను పెంచే క్రమం లో

నీకు నేను;-

కొన్ని సార్లు దయ్యం గా

కొన్ని సార్లు దేవత గా

కనిపించి ఉండొచ్చు.

కానీ నిజానికి నేను రెండూ కాదు నాన్నా!!

నా బిడ్డ బాగు కోరుకునే లక్క వంటి తల్లిని.

ఎప్పుడూ నీ సుఖ శాంతులు కోసం

తపన పడే మమతల పాల వెల్లిని.

కృష్ణా తరంగాలు గ్రూప్ లో తల్లి మీద కవిత రాయమంటే రాసిన అభివ్యక్తి. ఆ గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ Tvs Ramakrishna Acharyulu గారికి ధన్యవాదములు,అభి వాదములతో

శుభోదయం

అందరికీ అభివాదములు

విరహం లో విరిసే కళలుకొత్త జంట సరదాల, కోర్కె తీరుతరుణాలఆషాడపు ఆగమనం రగిలించెను విర హానలంఅలివేణి కి పుట్టింటికి వెళతానని మోదంపడకటింటి మురిపాలకి కుదరదని సతీపతు ల ఖేదం”నెలే కదా” అనే నెలత, “ససే మిరా” అనే భర్త.ఏమన్నా తప్పదు,మెట్టినిల్లు దాటాలివనితఆషాడపు పట్టీ తో అరుదెంచిరి అమ్మా ,నాన్నఆ రోజే వారి కూడి పుట్టింటికి చేరే భామఅమ్మింట్లో అమ్మడికి మహారాణీ వైభోగంకాలు కింద పెట్ట కుండ అడుగుకు మడుగొత్తు జనం.చిన్ననాటి నేస్తులతో అచ్చట్లూ.ముచ్చట్లూఅన్నింటా పతి ఊసే తన్ను మరచిఅతని ధ్యాసెఓయమ్మో !అతడు తప్ప వేరు మాట మాట్లాడవఅన్ని నాళ్ళ మన స్నేహం ఇంత లోనెమరిచావ!అనే చెలుల”నాగండే! మీ పెళ్ళి ళ్ళ వనిండే!ఈ కంటికి ఈ రెప్పలు ఎంత దూరముంటాయి.పెళ్ళయాక మీ మాటలు ఎలా మారి పోతాయో!చూసాక చెబుతాను,ఇపుడేమీ అనను మిమ్ము!”అంటుందీ ఈ గడసరి,చెలుల చేస్తు ఎగతాళి.పగలంతా ఎట్లున్నా,రాత్రులందు యాతననిదుర రాని కన్నుల, నిట్టూర్పుల సెగలప్రియుని చేరు కామన,తీరనిది ఆ తపనఆషాడ మేఘమా,మా వారికి మాట చెప్పుఅతని దరికి నన్ను చేర్చు పరుగుతీయు కాలమాఅంటుంటే అతివ మనసు అంత లోనే అతని పిలుపుమోగే చర వాణి తీసి”ఎంత లోన నెల దాటును. మరో నాల్గు రోజు లేగ.అంత ఆత్ర మైతె ఎలా?తట్టు కోక తప్పదు కద!అంటు ముదరకిస్తుంది,అతని నదుపు చేస్తుంది.మొన్నే గా పెళ్లయింది.అపుడే ఆరిందా అయింది.తన మనసుని విప్ప కుండా అబ్బో ఎన్నెన్ని కళలుమీ ఇల్లూ మా ఇల్ల ని అమ్మ తోటిఎన్ని కబుర్లుపండిన గోరింట చేత భర్త పైని అనురాగం చూపిశ్రావణ పట్టీ పట్టుకు చెలుని చేరపయనం మయిఇహ పరాల సాధనకైభర్త చెంత చేరుతుంది.

13 వ కవితా తరంగాలు

నాడూ!నేడూ!…నిన్నటి వరకు అస్పృశ్యత నేరం,నేడు స్పృశిస్తే పెద్ద ఘోరం.మనసుల్లో వుండే సామాజిక దూరం;-అలవోకగా మనుషుల్లోకి దిగింది.కరోనా కబంధ హస్తాల్లో,మరోనా అనే మరణ శాసనం తో;-జగం గిల గిల, జనం విల విల.ఆర్ధిక రంగం అతలా కుతలం;-అంతటా ఆవరిస్తున్న యుద్ధ మేఘం.ఎంతో సాధించాం అనుకున్నాం;-ఇదేమిటిలా కధ అడ్డం తిరిగింది.వ్యాధేమిటి ఇలా చుట్టేసింది;-వ్యధేమిటిలా తిప్పి తిప్పి కొడుతోంది.కాళ్ళు కట్టేసుకునినోళ్ళు మూసేసుకునివాపుని బలుపను కున్నామని వాపోతున్నాంరేపు ని ఊహించుకుని నీరు గారి పోతున్నాం.అంతుచిక్కని అయోమయం లో,అనుక్షణపు అంతర్మధనం తో;–ఇందు లోంచి పుట్టేది గరళమైనాఅమృత మైనా;-నాడు ఎవరికి పంచాలో ,ఎక్కడ తుంచాలో తెలిసిన;-శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణ వేఅనే భిన్నత్వం లో ఏకత్వ సాధనా మార్గంలోక కల్యాణ పర మార్ధం ఎరిగిన నాయకత్వంఅందుకే ఆ తీరు అందరికీ ఆమోదం, అతి మోదం అయింది.కానీ నేడు;-మనిషికీ మనిషి కీ కుదరని తనం,అంతటా విస్తరించిన పెను మౌఢ్యం.మెరిసే వజ్రం వెనుక అది పుట్టిన గనిని ఎత్తి పెట్టే జనం.మొరిగే వాటి కోసం ఊరేగింపు ఆగదు కదా!!నీ దారి న నీవే సాగిపో!!నీ గమ్యం నీవే చేరుకో!!.రచన: సావిత్రీ రమణారావు.

15th ..కవితా తరంగాలు

రోగ నగరిలో రోజుల కోసం….

18 th may2020

ఇపుడు బతుకులు

అస్తవ్యస్త చిత్రాలు;-

అసంబద్ధ వాక్యాలు.

కరోనా ఉపద్రవం;-

కలిగించిన పెనువిషాదం.

కూడు లేక,గూడు లేక

అసంఖ్యాక జనం.

ఆర్తి నిండిన సమాజం

ఆశగా చూసేది యువ శక్తి వైపు;-

వెర్రిగా అడిగేది నవ యుక్తి కొరకు.

నిజమే!యువకులు మీరు;-

మీ మీ కొలువుల ల్లో–

అత్యధిక వేతనాలు,

వీకెండ్ పార్టీలు

విర్రవీగి విలాసాలు

ప్రేమికుల దినాలూ

పెట్రేగిన వికారాలు ;–

ఊపిరి సలప కుండా!

రేపటి తలపు లేకుండా!!

అవన్నీ నిన్నటి మిణుగురులు;

మీ కంటికి కమ్మిన పొరలు.

ఆ మోహ నగరి నుండి

నేడు ఇలా ఈ రోగ నగరి లోకి.

పాపం! ఇది మీకు కోలుకోలేని దెబ్బే!!

తప్పించుకో వీలు లేని బాధే!

ఏముందిక్కడ?

ఎగిరే ఉసురులు

రగిలే ఎదలు

వమ్ము అవుతున్న నమ్మకాలు

కమ్ముకుంటున్న చీకట్లు.

ఇదో భయానక నేపథ్యం;-

ఇట ఆగని శవ సేద్యం.

ఈ కర్కశ రక్కసి తో రణం;-

ఈ శతాబ్ది పెను విషాదం.

ఇలాటపుడు కూడా. .

తోటి వారి ధ్యాస

ఉన్న స్థితి

ఎరిక వుండొద్దా?

కుల ,మతాల కుళ్లు

వదులు కోవద్దా??

ఇక నెట్టింట్లోంచి

నట్టింట్లోకి రండి

ఆ చరవాణి ని వొదిలి

సాటి నర వాణి వినండి

పుచ్చు కోవటం తప్ప ఇవ్వటం

తెలియని మీ తరం

ఇంటా, బయటా

మీ కోసం పిలుపు లని

అందుకోండి.

జనం కోసం మనమూ అని

నడుం కట్టండి.

అమ్ము కోవాలనే ఆశలు ఆవి రాయె

కమ్ము కుంటున్న నీడలు పీడలాయె

అయినా భావి కోసం తప్పదు

ఇపుడిక బతుకు వేషం ఒప్పదు

లెండి! కదలండి!

కలిసి అడుగేయండి!

నిరాశ నీడ వీడి

చిరాశ వాడ పడి

తలలో తలపులకు

తపన ల జత చేసి

తమస్సులను తరిమి కొట్టండి.

ఉషస్సులను ఉరికి పట్ట రండి.

శుభో దయం

అందరికీ అభి వాదములు

కరంటు తీగెల లాంటివేమనుషుల మధ్య సంబంధాలు.సరిగా సంధానించితేవెలుగులుప్రసరించి, మరెన్నో రకాలుగా ఉపయోగ పడుతూ అలరిస్తాయి.లేకుంటే షాకులు,షార్ట్ సర్క్యూట్ల తో బాధించటం,నష్టపర్చటంచేస్తాయి.ఏ బంధాన్ని అయినా,అనుబంధాన్ని అయినా నిలబెట్టు కోవటానికీ,సజావుగా సాగించటానికివ్యక్తి కావలిసింది వ్యక్తి సంస్కారం,మానసిక పరిణితి.శుభోదయంఅందరికీ అభివాదములునా అభివ్యక్తులు ఆదరించి ,ప్రోత్ససహిస్తున్న ముఖ పుస్తక మిత్రు లందరికీ నా హృదయ పూర్వక అభి వాదములు, ధన్య వాదములు.సావిత్రీ రమణారావు.