గాయం మాన్పే గేయం కా!!!నిన్నటి వరకూ అంతా నీ ప్రతిభన్నావ్ !నీ కసాధ్యం లేదన్నావ్ !చంద్ర లోకాన్ని చుట్టి వచ్చానని జబ్బ లేగ రేసావ్!గ్రహాల్లో నీళ్ళకి ,నివాసాలకి ప్రయత్నాలు మొదలెడ తానన్నావ్పైవాడు ఎవడూ లేడన్నావ్!ప్రకృతి నాకే ,నాదే అని కుప్పిగంతు లేసావునీలాటి వదరు బోతుకి సుదర్శనంఏలా!చిన్న రేణువు చాలురా ఉత్తరకుమారా !నీకు కనబడని కరోనా మరోనా అందికలల నుండి నిన్ను ఇలకి దింపిందిపేరాశల ఇటుకలతో కట్టుకున్నపేక మేడలు కూల్చిందినలుగురిదీ నొల్లుకోవాలన్ననాటకాలకు తెర దించిందివణుకు తప్ప కంటికి కునుకులేకుండా చేసింది.ప్రపంచకు గ్రామ భావన నిఛిద్రం చేసిందినీ ఆశల అంతం, రేపుల దగ్ధం చేసియుగాంతం ఇదే నా అనిపింప జేసింది.ఈ మరణ మృదంగ వాదనఈ ఆరని మనుషుల వేదననీ జాతి మహా ప్రస్థానానికిపూర్వ ప్రస్తావన చేయకురా!ఇక పై మానవత్వ పునాది పైరేపటి కలల సౌధం లేపరాతోటి మనుషుల గాయాలకుసాటి లేని లేపనం అవరా!

8 వ కవితా తరంగాలు

పిడికిట్లో ప్రపంచం!!..బాలకృషుడి నోట్లో విశ్వంయశోదకి కలయో మాయో అన్న సంశయ మేమో గానీ;-మనకీ పిడికిట్లో ప్రపంచంజగమే మాయా, ఈ బ్రతుకేమిటయాఅనిపించేస్తోంది అన్నది నిజం.”కర్లో దునియా ముట్టీ మే‌”అని ముద్దుగా మురిపిపించిందీఈ చరవాణే;-“భర్ లో మన్ కో మిట్టీ సే” అనిఫేకులూ,బోకులూ తో బుర్ర నింపేస్తోందీ వగల బోణే.మన గుప్పిట్లో ఉంటుంది అనుకుంటేమననే తన గుప్పిట్లో పెట్టేసుకుంది.ఈ అంతర్జాలం లో ఉనికి కి,ఈ మాయాజాలం లో మనికి కి;-కాలు కదపక్కరలేదువేలు మెదిపితే చాలు.మంచీ చెడు అన్నీ కళ్ళ ముందే;-ఎంచటం ,తుంచటం మనకి తెలియాల్సిందే!!!మన కాలం భోంచేస్తూ,మానవ బంధాలను తెంచేస్తూ;-ఈ అరచేత జగం చల రాణి,ఇహ పరపు ఊసు మరిపించే వదరు బోణి!!..పుస్తకాలకు సమాధి కట్టింది,మస్తకాలు మొద్దు బార్చింది!!ఇప్పుడు ఈ సాంకేతికత ;-వరమో, శాపమోతేల్చు కోమనితన రింగు టోనులసంగీతం పాడుతోందిఈ కీరవాణి.

11 కవితా తరంగాలు

నువ్వే లోకం!!!..పుట్టక ముందు నుంచే నిన్నుప్రేమించేపుట్టాక నువ్వే లోకం గా జీవించేఏకైక జీవిని.కడుపు లో పడ్డ నాటి నుండి పడ్డ తిప్పలూ నొప్పులూభూమి మీద నువు పడిన ఉత్తర క్షణం లో మరిచి పో గలిగిననీ పై ఎన లేనిమమకారాన్ని.నీ ఆకలి, ఆశలు అర్ధం చేసుకునినీ బుద్ధికి,వృద్ధికి దోహదం చేసే నేనునీకు లాలి పాటలు పాడినావేల పాఠాలు నేర్పినానీకు చీకటి తెలియని రేపుల నీయాలనివేకువ రేకుల శోభల నువు ఎదగాలని.అడ్డల్లో బిడ్డవి గడ్డాలూ, మీసాలూపెంచేసిపొత్తిళ్ళ లోంచి ఒత్తిళ్ళ లోకి జారుకుంటేనీ ఆశల ఆరాటం తో నువు జీవన పోరాటం లో తడ బడుతుంటే..నిను పెంచే క్రమం లోనేను కొన్ని సార్లు దయ్యం గాకొన్ని సార్లు దేవత గా నీకనిపించిఉండొచ్చు కానీ ;-నిజానికి నేను రెండూ కాదు నాన్నా!!నా బిడ్డ బాగు కోరుకునే లక్క వంటి తల్లినిఎప్పుడూ నిన్ను నా అక్కున చేర్చు కోవాలనితపన పడే మమతల పాల వెల్లిని.

విరహం లో విరిసే కళలుకొత్త జంట సరదాల, కోర్కె తీరుతరుణాలఆషాడపు ఆగమనం రగిలించెను విర హానలంఅలివేణి కి పుట్టింటికి వెళతానని మోదంపడకటింటి మురిపాలకి కుదరదని సతీపతు ల ఖేదం”నెలే కదా” అనే నెలత, “ససే మిరా” అనే భర్త.ఏమన్నా తప్పదు,మెట్టినిల్లు దాటాలివనితఆషాడపు పట్టీ తో అరుదెంచిరి అమ్మా ,నాన్నఆ రోజే వారి కూడి పుట్టింటికి చేరే భామఅమ్మింట్లో అమ్మడికి మహారాణీ వైభోగంకాలు కింద పెట్ట కుండ అడుగుకు మడుగొత్తు జనం.చిన్ననాటి నేస్తులతో అచ్చట్లూ.ముచ్చట్లూఅన్నింటా పతి ఊసే తన్ను మరచిఅతని ధ్యాసెఓయమ్మో !అతడు తప్ప వేరు మాట మాట్లాడవఅన్ని నాళ్ళ మన స్నేహం ఇంత లోనెమరిచావ!అనే చెలుల”నాగండే! మీ పెళ్ళి ళ్ళ వనిండే!ఈ కంటికి ఈ రెప్పలు ఎంత దూరముంటాయి.పెళ్ళయాక మీ మాటలు ఎలా మారి పోతాయో!చూసాక చెబుతాను,ఇపుడేమీ అనను మిమ్ము!”అంటుందీ ఈ గడసరి,చెలుల చేస్తు ఎగతాళి.పగలంతా ఎట్లున్నా,రాత్రులందు యాతననిదుర రాని కన్నుల, నిట్టూర్పుల సెగలప్రియుని చేరు కామన,తీరనిది ఆ తపనఆషాడ మేఘమా,మా వారికి మాట చెప్పుఅతని దరికి నన్ను చేర్చు పరుగుతీయు కాలమాఅంటుంటే అతివ మనసు అంత లోనే అతని పిలుపుమోగే చర వాణి తీసి”ఎంత లోన నెల దాటును. మరో నాల్గు రోజు లేగ.అంత ఆత్ర మైతె ఎలా?తట్టు కోక తప్పదు కద!అంటు ముదరకిస్తుంది,అతని నదుపు చేస్తుంది.మొన్నే గా పెళ్లయింది.అపుడే ఆరిందా అయింది.తన మనసుని విప్ప కుండా అబ్బో ఎన్నెన్ని కళలుమీ ఇల్లూ మా ఇల్ల ని అమ్మ తోటిఎన్ని కబుర్లుపండిన గోరింట చేత భర్త పైని అనురాగం చూపిశ్రావణ పట్టీ పట్టుకు చెలుని చేరపయనం మయిఇహ పరాల సాధనకైభర్త చెంత చేరుతుంది.

13 వ కవితా తరంగాలు

నాడూ!నేడూ!…నిన్నటి వరకు అస్పృశ్యత నేరం,నేడు స్పృశిస్తే పెద్ద ఘోరం.మనసుల్లో వుండే సామాజిక దూరం;-అలవోకగా మనుషుల్లోకి దిగింది.కరోనా కబంధ హస్తాల్లో,మరోనా అనే మరణ శాసనం తో;-జగం గిల గిల, జనం విల విల.ఆర్ధిక రంగం అతలా కుతలం;-అంతటా ఆవరిస్తున్న యుద్ధ మేఘం.ఎంతో సాధించాం అనుకున్నాం;-ఇదేమిటిలా కధ అడ్డం తిరిగింది.వ్యాధేమిటి ఇలా చుట్టేసింది;-వ్యధేమిటిలా తిప్పి తిప్పి కొడుతోంది.కాళ్ళు కట్టేసుకునినోళ్ళు మూసేసుకునివాపుని బలుపను కున్నామని వాపోతున్నాంరేపు ని ఊహించుకుని నీరు గారి పోతున్నాం.అంతుచిక్కని అయోమయం లో,అనుక్షణపు అంతర్మధనం తో;–ఇందు లోంచి పుట్టేది గరళమైనాఅమృత మైనా;-నాడు ఎవరికి పంచాలో ,ఎక్కడ తుంచాలో తెలిసిన;-శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణ వేఅనే భిన్నత్వం లో ఏకత్వ సాధనా మార్గంలోక కల్యాణ పర మార్ధం ఎరిగిన నాయకత్వంఅందుకే ఆ తీరు అందరికీ ఆమోదం, అతి మోదం అయింది.కానీ నేడు;-మనిషికీ మనిషి కీ కుదరని తనం,అంతటా విస్తరించిన పెను మౌఢ్యం.మెరిసే వజ్రం వెనుక అది పుట్టిన గనిని ఎత్తి పెట్టే జనం.మొరిగే వాటి కోసం ఊరేగింపు ఆగదు కదా!!నీ దారి న నీవే సాగిపో!!నీ గమ్యం నీవే చేరుకో!!.రచన: సావిత్రీ రమణారావు.

15th ..కవితా తరంగాలు

రోగ నగరిలో రోజుల కోసం….ఇపుడు బతుకులుఅస్తవ్యస్త చిత్రాలుఅసంబద్ధ వాక్యాలుకరోనా ఉపద్రవంకలిగించిన పెనువిషాదంకూడు లేక,గూడు లేకఅసంఖ్యాక జనంఆర్తి నిండిన సమాజంఆశగా చూసేది యువ శక్తి వైపువెర్రిగా అడిగేది నవ యుక్తి కొరకునిజమే!యువకులు మీరుమీ కొలువుల ల్లోఅత్యధిక వేతనాలు,వీకెండ్ పార్టీలువిర్రవీగి విలాసాలుప్రేమికుల దినాలూపెట్రేగిన వికారాలు ..ఊపిరి సలప కుండా..రేపటి తలపు లేకుండా..అవన్నీ నిన్నటి మిణుగురులుమీ కంటికి కమ్మిన పొరలుఆ మోహ నగరి నుండినేడు ఈ రోగ నగరి లోకి..అంటే మీకు కోలుకోలేని దెబ్బేతప్పించుకో వీలు లేని బాధే..ఏముందిక్కడ…ఎగిరే ఉసురులు,రగిలే ఎదలువమ్ము అవుతున్న నమ్మకాలుకమ్ముకుంటున్న చీకట్లు.ఇదో భయానక నేపథ్యంఇట ఆగని శవ సేద్యంఈ కర్కశ రక్కసి తో రణంఈ శతాబ్ది పెను విషాదంఇలాటపుడు కూడాతోటి వారి ధ్యాసఉన్న స్థితి ఎరికవుండొద్దా?కుల ,మతాల కుళ్లువదులు కోవద్దా??ఇక నెట్టింట్లోంచినట్టింట్లోకి రండిఆ చరవాణి ని వొదిలిసాటి నర వాణి వినండిపుచ్చు కోవటం తప్పఇవ్వటం తెలియని మీ తరంఇంటా, బయటాసొదలు, వ్యధలు అర్ధం చేసుకోండిఅందరి కోసం నడుం కట్టండి.నిరాశ నీడ వీడిచిరాశ వాడ పడితలలో తలపులకుతపన ల జత చేసితమస్సులను తరిమి కొట్టండి.ఉషస్సులను ఉరికి పట్ట రండి.

18 th may2020

కరంటు తీగెల లాంటివేమనుషుల మధ్య సంబంధాలు.సరిగా సంధానించితేవెలుగులుప్రసరించి, మరెన్నో రకాలుగా ఉపయోగ పడుతూ అలరిస్తాయి.లేకుంటే షాకులు,షార్ట్ సర్క్యూట్ల తో బాధించటం,నష్టపర్చటంచేస్తాయి.ఏ బంధాన్ని అయినా,అనుబంధాన్ని అయినా నిలబెట్టు కోవటానికీ,సజావుగా సాగించటానికివ్యక్తి కావలిసింది వ్యక్తి సంస్కారం,మానసిక పరిణితి.శుభోదయంఅందరికీ అభివాదములునా అభివ్యక్తులు ఆదరించి ,ప్రోత్ససహిస్తున్న ముఖ పుస్తక మిత్రు లందరికీ నా హృదయ పూర్వక అభి వాదములు, ధన్య వాదములు.సావిత్రీ రమణారావు.

గజల్ ముషాయిరా–02-06–2016

యువత పాడ  అభయరాగ మిట నెక్కడ దొరుకుతుంది
రైతు నవ్వ   ఘన సాయం  ఇంకెక్కడ దొరుకుతుంది

యువ శక్తులు ఉప్పొంగే నవ భారత శకం మనది
తీరు నేర్పు దారి చూపు వెలుగెక్కడ దొరుకుతుంది

నైపుణ్యం  కొరవడగా నలుగుతున్న యువత మనది
సానపెట్టి మెరిపించే   చదువెక్కడ దొరుకు తుంది

తాచుల వలె, రేచుల వలె ఓటేయగ రారేమిటో
నిర్లిప్తత వీడి కదులు జనమెక్కడ దొరుకుతుంది

ఆవురావు రని అన్నం ఆరగించు జన మంతా
రైతు హితం ఆశించే  క్షణమెక్కడ దొరుకుతుంది

దన్నుంటే మట్టి లోంచి బంగారం తీసీయడ ?
అన్న దాత వెన్నుతట్టు బుద్దెక్కడ దొరుకుతుంది

పక్క తోవ పట్టెనంట పరిశోధన రంగ మంత
రాసి గాక వాసి పెంచు విధ మెక్కడ దొరుకుతుంది

వ్యవస్థతో అవస్థయితె మన శక్తులు వృధా కావ?
సౌలభ్యం   తెలియ జేయు  రీతెక్కడ దొరుకు తుంది

భారతాన బతుకంటే ఏటికి ఎదు  రీదటమా?
గమ్యంతెలి యని యానం  దారెక్కడ దొరుకుతుంది

మనోడనో మరోటనో   చచ్చు పుచ్చు ఎంచుతార?
వోటమ్మక ప్రభుత  నెన్న తెలివెక్కడ దొరుకుతుంది

అబ్బిగాడి  నబ్బీ మెడికల్ కిట్
కధా కమామిషు.
.ష్.. ష్..ష్….హెలికాప్టర్..(అదే మా ఆదర్శ మాతృ మూర్తి) ఎబౌ..

మొన్నీ మధ్య మా బాలవిష్ణు   అంటే మా నెల రోజుల మనవడు-వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మి ముహూర్తం లో పుట్టాడు కదా అని వాడిని నేను అలా పిలుస్తున్టాను—కి వాక్సినేషన్ చేయించాము.వాడికి వెంటనే జ్వరం వచ్చింది.దాని వలనో ఏమో  constipation  develop ayindi. పట్టాల్సిన మందులు  సంఖ్య పెరిగింది.వాడూ రోజు తాగే రెండు చుక్కల మందులకే మాకు చుక్కలు చూపిస్తున్నాడు.ఇక ఈ కొత్త మందులు చూసే సరి కి మా బేబీ బాబోయ్ అంది.అయినా పట్టక తప్పదుగా..

రోజూ పిల్ల ల పెంపకం మీద నాకు  ఇచ్చే లెక్చర్ లకు కాస్త  విరామం ఇచ్చి నన్ను పట్ట మని శరణు జొచ్చింది.జొచ్చింది కదా అని నేను  మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని,ఓ సారి  మా ఆమ్మాయి మణి వారిని గిచ్చి ,మా రోజుల్లో అంటూ ఫ్లాష్ బ్యాక్ లు ..చూపడానికి లేక వర్ణన తో సరి పెట్టి…

“ఇలా తే “అని  బుడుగ్గాడిని కాళ్ళ మీద పడుకో బెట్టు కుని,పెదాల మధ్య వేలు పెట్టి చెమ్చాతో మందు వాడి నోట్లో పోసి ,ఓ ముక్కు రంద్రం మూసి ఒక్క గుక్కలో తాగించిసేను.
మా అమ్మాయి హాస్చెర్య పడి పోయి ..
“మమ్మీ నీకు కూడా కొంచెం పిల్ల లని పెంచటం వచ్చినట్లే వుంది సుమీ. “హాంటూ…”ఈ టెక్నిక్ బావుంది..”అని..వాడితో పడే అవస్త  ఆ పూట  కి తప్పింది కదా అని వూపిరి   పీల్చుకుంది.

మర్నాడు పొద్దున్న మళ్ళీ మందు చెంచా మా అమ్మాయి,కా పొతే ఈసారి ముఖం లో  రోజూ ఉండే బేల తనం పోయి ఆత్మ విశ్వాసం తో  కళ కళ  లాడి పోతూ.

“మమ్మీ  నా కాళ్ళ మీద పడుకో  బెట్టు…నేను ఇక పట్టేయ గలను “అంది.”సరే “అన్నాను.మా    బుడతడు  నన్ను ఓర కంట పరికించి   భావగర్భితం గా ఓ   చిరునవ్వు  చిందించి కళ్ళు మూసుకున్నారు.శ్రీ వారి చిద్విలాసానికి అర్ధం అప్పుడు తెలియ లేదు మాకు.

మా మాతృశ్రీ నాలాగే పెదాల మధ్య వేలు పెట్టి మందు పోసి ,ఓ ముక్కు రంధ్రం మూసింది ..శ్రీవారికి పల బారింది.. ఉక్కిరి  బిక్కిరి అయ్యారు..నీలం గా మారారు..మా  మాతృ రత్నం భయం తో గాభరాగా బేర్ మంది.

“నువ్వుండు “అని వాడిని భుజాన్నేసుకొ ని, కిందా మీదా ఎగరేసి,అటు తిప్పి ,ఇటు తిప్పి డోలు బజాయించినట్టు బజాయించాక  మళ్ళీ వూపిరి అందుకున్నాడు.

మా అమ్మాయి  కూడా ఊపిరి పీల్చుకొని.”.మమ్మీ నువ్వుండ బట్టి.లేపోతే బాబోయ్  నేను వూహ లో కూడా ఆ పరిస్థితి చూడ లేను “అని మళ్ళీ బావురు  మంటూ,సడన్ గా తన డైలీ డోస్ అఫ్ లెసన్స్   ఆన్ పేరెంటింగ్   గుర్తు వచ్చి–…
అసలే ,తను నేటి మహిళ ,మేటి మహిళా ,ఈ నాటు పద్ధతుల మమ్మీ ని అడగటం ఏమిటి అని  గోటు  పోయి,
మళ్ళీ ఈ మమ్మీ మీద డిపెండెన్సు ఏమిటి, ఛీ ఇక ఇండిపెండెంట్ గా ఉండాలి అని నిర్ణయించుకుందేమో..
ఇలా అయితే రేపటి నుండి  మమ్మీ కి పిల్లల  పెంపకం మీద లెక్చర్ సెషన్ ఎలా కండక్ట్ చేస్తుంది ,అనుకుందేమో..ఆరున్నొక్క రాగాలాపన అర్ధాంతరం గా ఆపేసి, నాలుక  కోరుక్కుని,

ఇలా కాదు అని దీనికి పరిష్కారం చూడాలి అని అర్జంట్ గా  మొబైల్ ఆన్ చేసి  క్రయింగ్ మదర్  వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో బేబీస్ క్రై లింక్ లో చూసి,ఈజీ వే    టు గివె మెడిసిన్ టు బేబీస్ టెక్నిక్ చూసి వెంటనే  ఆన్ లైన్ షాపింగ్ సైట్   బేబీ క్రై లోనబ్బీ బేబీ మెడికల్ కిట్ కి ఆర్డర్ ప్లేస్ చేసీ సింది.

రెండు రోజుల్లో ఆ కిట్  వచ్చేస్తుంది..  అటు తరవాత అంతా చాలా ఈజీ అసలు ప్రాబ్లం ఉండదు.తను ఇండిపెండెంట్ గా ,సెల్ఫ్  రిలయంట్ అయి పోవచ్చు. ఆ కిట్ వచ్చాక మా బాల విష్ణు హ్యాపీ గా  మందు తాగేసి, వట పత్ర సాయి స్టయిల్లో నవ్వులు విర జిమ్మేస్తాడు,తను  అబ్బి గాడికి  నబ్బీ కిట్ తోమందు  పడుతున్నట్టు  ఫోటో సెషన్ చేసి ,ఇద్దరూ కలసి కేలండర్ లో చిన్ని కృష్ణుడు యశోదా దేవీ లా పోజు  పెట్టేసిన  ఫోటో  నబ్బీ  కిట్ వాళ్లకి పంపితే , వాళ్ళ ప్రోడక్ట్  advertise చేసికుందికి మోడల్స్ గా  సెలెక్ట్ ఆవ వొచ్చు  అన్న ఆలోచన తో ఆగ కుండా మరో అడుగు ముందుకేసి అపుడే సెలెక్ట్ అయినట్లు,కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినట్లు  సినిమా స్కోప్  కల లు కంటూ..

పనిలోపనిగా “మమ్మీ ఆ కిట్ వస్తే నో ప్రాబ్లం కాని అది వచ్చే వరకు ఈ   పిల్ల ల పెంపకం తెలియని  నువ్వు నీ ఓల్డ్  టెక్నిక్ వాడి రోజూలా మందులు  పట్టించేయ”మని ఆర్డర్ జారీ  చేసింది.  “చిత్తం “మహా రాణీ అన్నాను ,మరోలా అనే అవకాశం లేక.

ఇహ ఇవ్వాళ ఆ నబ్బీ మందుల కిట్ వచ్చింది.ఈ మమ్మీ ఓ నాలుగు వందలు సమర్పించి దానికి విడిపించి బేబీ కిచ్చింది.ఆ బేబీ దాన్ని విప్పి స్టే రి లై జ్ చేసి అందు లోంచి ఓ పశువులకి ఇంజక్షన్  ఇచ్చే  సిరంజి లాటిది తీసి దాంట్లో మందు ఎక్కించి  అబ్బి గాడి నోట్లో చుక్క చుక్క లు గా వేసింది.వాడు తుప్పు తుప్పున ఉమ్మేసాడు.ఏమి  చేసినా  తాగ  లేదు.  మీ పప్పులు నా దగ్గర ఉడకవని మా బాహు  బ లి ఆ పశువుల సిరంజి అవలీలగా ఆవలకి నెట్టి  మళ్ళీ ఏడిచేసి నీల మేఘ శ్యామా వతారం లో  దర్శన భాగ్యం కలిగించేడు . దాంతో మా పుత్రికా రత్నం ఠారెత్తి. “,మమ్మీ వీడు దీనితో తాగటం లేదు “అంది నా వైపు బితుకు బితుకు మంటూ చూస్తూ, పర్యవసానం పట్ల బాగా  వున్న అవగాహన అమ్మాయి  మణి వారి    కళ్ళ ల్లో భయం   ప్రస్ఫుటం గా నాకు కనుపిస్తూ.

ఆ లీలా మానుష విగ్రహ సూత్ర ధారి..  చిరు  నవ్వుకు అర్ధం  అప్పుడు బోధపడింది నాకు.
ఇదే అదను అని నేను మా బేబీ కళ్ళు తెరిపించీ సేను మా అమ్మాయి భయం నిజం చేస్తూ . వచ్చిన ఏ అవకాశాన్ని వదలక పోవటం లో దానికి నాలుగు ఆకులు ఎక్కువచదివానేమో..అందుకున్నాను.

“మీ అబ్బీ నీ నబ్బీ కిట్ ని ,   నిన్నూ దొబ్బీ (ఈ పదాన్ని క్షమించాలి,ప్రాస కోసం వాడాను) అన్నాడు  మాతృ  శ్రీ.
మందు రుచి నచ్చక తాగక పొతే  ఆ పశువుల కి ఇంజక్షన్ చేసే సిరంజి తో తాగుతాడా.ఇంగితం  వుండొద్దూ.ఉగ్గుగిన్నో,చెంచా తో అయే పని కి నాలుగొందలు తగలేసి ఆ నబ్బీ కిట్  కొన్నావు. ఇక ఇప్పుడది ఓ డబ్బీలో పెట్ట టానికి తప్ప ఎందుకూ  పనికి రాదు.మా రోజుల్లో .”.ఫ్లాష్ బ్యాక్..లోకి  వెళి పోయాను.

మరిప్పట్లో వర్తమానం లో కి  రానని తెలుసు కాబట్టి మా హెలికాఫ్టర్ మౌనం గా నా ఆత్మ శాంతికి ప్రార్ధిస్తూ , తన పేరెంటింగ్ కి కాస్త విరామం ఇచ్చి నబ్బీకిట్ దాచటానికి  డబ్బీ  వెతక టానికి వెళి పోేయింది.

మా పెరియాళ్వార్ మీ చేత  నాలుగొందలు ముడుపు ఎలా చెల్లింప చేసానో చూసారా  అన్నట్లు ఓ సారి కనుబొమ్మ ఎగరేసి కుడివైపు పై  పెదవిని  గజల్ సింగర్  జగ్ జిత్సింగ్ లా కాస్త పైకి వంగేలా  చేసి మా  తల్లి ,కూతుర్ల వైపు విజయ గర్వం తో ఓ హాస చంద్రిక నిశ్శబ్దం గా  విసిరి  అమ్మమ్మ  తల్పం  మీద ఎప్పటలా  శ యనించ నుప క్రమిం చేరు.

Gazal mahal –04-06–2016

నగరం లో వాన ఊసు తలచు కుంటె భయమేలే
పదిలంగా వుండనీక తడుపు తుంటె భయమేలే

కొందరికది మోదమయిన ఎందరికో ఖేదంలే
ఒక్కుదుటన  వర్ష మొచ్చి ముంచుతుంటె భయమేలే

ఒక్క గంట కురిసిందా ద్వీప మౌను  మురుగు నూరు
కూడు ,గూడు  లేని పాడు బతుకు అంటె భయ మేలే

వానంటే, వరదయితే నగరం లో నలుగుడు లే
ఇల్లు చేరు దారి లేక  వేలు టంటె భయమేలే

చింకి పాత వంటి మీద,!బతుకె బాధ పుడమి మీద!
పులి మీదీ పుట్ర వాన  !వచ్చునంటె భయేమేలే

తాగు నీరు, పవరు కరువు,ధరల నందు కొనేలేము
శవం మీద పైస  లేరు అసురులంటె భయమేలే

చెరువు గడ్డ అనే లేక ఆక్రమణ చేసినారు
చుక్క నీరు  పీల్చ లేని  భూములంటె భయ మేలే

పూడిక తీతే తెలియని నీటిపారు దలవస్థ లే
అధికారుల నిర్లక్ష్యం మాట అంటె భయమేలే

బాధ్యత లేని జనం పాలకులను తిడతారు
తన  వంతు ను చేయకుండ గడుపు తుంటె  భయమేలే

ఎల్.  నినోలు,లా నినోలు మన చేతల పుణ్యమే
గతి తప్పిన ఋతు చక్రం తలచు కుంటె భయ మేలే

పచ్చదనం మట్టు బెట్టి చిచ్చు రేపు కుంటిమిగా!
వాన జాణ  వెర్రాటలు చూస్తు ఉంటె భయమేలే

పాలకులకు ఫికరు లేదు, పాలితులకు మతి లేదు
వర్ష హర్ష  మే ఉండని  రోజులంటె భయ మేలే-
Gazal canvas—06-06-2016

మనసు నెంతొ మురిపిస్తూ ఊరించే ఫలాలులే
మనిషి నెపుడు బులిపిస్తూ ఉరికించే ఫలాలులే

రంగు హాంగు చూసి మనం  ఆశపడితె, చేత పడితె
ఆరోగ్య మలా  వుంచు హరియించే ఫలాలులే

మందు కొట్టి పండించే మన కాలపు పోకడలకు
రసం కాక విషం ఊరి పీడించే ఫలాలులే

అందాయని ఆత్రపడి అన్నిటినీ కోయమాకు
నాణ్యతెరి గితిన కున్న బాధించే ఫలాలులే

అభం,శుభం తెలియని వో   పసి ప్రాయపు పసిడి కొమ్మ
నిషిద్ధ మవు ఫల ముంటే వేధించే ఫలాలులే

నదురు బెదురు లేక నీవు  నాడెమయిన దాన్ని  ఎంచు
కుదురు ఉన్న కోడె గాని జోడించే ఫలాలులే

మనసిచ్చిన జతగానికి మంచి ఫలం చూసి ఇమ్ము
భావిలోన బతుకు  పధం వెలిగించే ఫలాలులే