నువ్వే లోకం!!!..

పుట్టక ముందు నుంచే నిన్ను

ప్రేమించిన

పుట్టాక నువ్వే లోకం గా జీవించే

ఏకైక జీవిని.

కడుపు లో పడ్డ నాటి నుండి పడ్డ తిప్పలూ నొప్పులూ

భూమి మీద నువు పడిన ఉత్తర క్షణం లో మరిచి పో గలిగిన నీ పై ఏన లేని

మమకారాన్ని.

నీ ఆకలి, ఆశలు అర్ధం చేసుకుని

నీ బుద్ధికి,వృద్ధికి దోహదం చేసే నేను

నీకు లాలి పాటలు పాడినా

వేల పాఠాలు నేర్పినా

నీకు చీకటి తెలియని రేపుల నీయాలనే.

వేకువ రేకుల శోభల నువు ఎదగాలనే.

అడ్డాల్లో బిడ్డవి గడ్డాలూ, మీసాలూ

పెంచేసి

పొత్తిళ్ళ లోంచి ఒత్తిళ్ళ లోకి

జారుకుంటే

నీ ఆశల ఆరాటం తో

నీ జీవన పోరాటం లో

నువు తడ బడుతుంటే..

నిన్ను చూస్తూ తల్లడిల్లే

నన్ను చేర సందేహమా??

నీతొలి నడకల కి నీకు

నడబండి గా

నీ గాయాల ను మాన్పే

మలాముగా

నీకు నేను కొత్తా??

నాకు నువ్వు బరువా??

నిను పెంచే క్రమం లో

నీకు నేను;-

కొన్ని సార్లు దయ్యం గా

కొన్ని సార్లు దేవత గా

కనిపించి ఉండొచ్చు.

కానీ నిజానికి నేను రెండూ కాదు నాన్నా!!

నా బిడ్డ బాగు కోరుకునే లక్క వంటి తల్లిని.

ఎప్పుడూ నీ సుఖ శాంతులు కోసం

తపన పడే మమతల పాల వెల్లిని.

కృష్ణా తరంగాలు గ్రూప్ లో తల్లి మీద కవిత రాయమంటే రాసిన అభివ్యక్తి. ఆ గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ Tvs Ramakrishna Acharyulu గారికి ధన్యవాదములు,అభి వాదములతో

శుభోదయం

అందరికీ అభివాదములు

Leave a comment